Latest News

Money Earning కోసం Wordpress బ్లాగు చాలా సులువుగా ఎలా తయారు చేయాలి ?


Google బ్లాగర్ మాదిరిగా WordPress లో కూడా బ్లాగు ను తయారు చేసుకోవచ్చు. Google బ్లాగర్  బ్లాగు ఎలా తయారు చేయాలో చూడండి . 
ఈ WordPress కూడా చాలా ప్రాచూర్యం లో వున్న బ్లాగ్ నెట్వర్క్. ప్రపంచం లో వున్న వెబ్ సైట్ లలో దాదాపు 30 % వెబ్ సైట్ లు WordPress లో వున్నాయి. మొదటి WordPress బ్లాగ్ 2013 లో ప్రారంబించబడింది . దీనిలో లభ్యమయ్యే కొన్ని వందల ఫ్రీ (250+) మరియు ప్రీమియం టెంప్లేట్ ల ద్వారా మనకు నచ్చిన టెంప్లేట్ ఎంచుకొని బ్లాగు ని అందం గా చేసుకోవచ్చు . దీనిలో వేలకొద్ది plugin లు లబ్యమవుతాయి . వీటి ద్వారా బ్లాగు ని అద్బుతం గా తీర్చిదిద్దుకోవచ్చు .

WordPress గురించి మరింత సమాచారం , వాటిలో లబ్యమయ్యే ఆప్షన్స్ , వాటిని ఎలా చేయాలో ఒకటి తర్వాత ఒకటి తెలుసుకొందాము . Google బ్లాగర్ లో మాదిరి గా WordPress లో అదనపు ఒప్షన్స్ కావాలంటే plugin లు వుంటాయి , అదే బ్లాగర్ లో Modify చేయాలంటే  కొంచం బేసిక్ కోడింగ్ ( HTML , XML) పరిజ్ఞానం వుండాలి . 

బేసిక్ WordPress బ్లాగు ను సులువు గా ఎలా చేయాలో చూద్దాం . 

  • మొదట www.wordpress.com ఓపెన్ చేయాలి 
  • బ్లాగ్ ఓపెన్ చేసినపుడు మీ బ్లాగ్ ఎలా ఓపెన్ కావాలో ఎంచుకోవాలి 
  • తర్వాత పేజి లో కొన్ని theme లు డిస్ప్లే చేయబడుతాయి , వాటి నుండి మనకు నచ్చిన theme select చేసుకోవాలి . 
  • తర్వాత మనకు కావలసిన డొమైన్ నేమ్ (వెబ్సైటు పేరు ) ని keyword ఇవ్వడం display చేయబడిన లిస్టు నుండి wordpress  ఇచ్చిన నేమ్ సెలెక్ట్ చేసుకోవచ్చు లేదా మీరు ముందుగా ఎంచుకొన్నది లబ్యమవుతుందో లేదో సెర్చ్ చేసుకోవచ్చు . 
  • మనకు Free వెబ్సైటు కావాలి కనుక ( సొంత డొమైన్ ఎలా చేయాలో తర్వాతి ఆర్టికల్ లో చూద్దాం ) Free బటన్ పైన క్లిక్ చేయాలి . 
  • తర్వాతి వచ్చే పేజి లో Free Plan  బటన్ పైన క్లిక్ చేసి సెలెక్ట్ చేసుకోవాలి . 
  • తర్వాత విండో లో మనం మన డీటెయిల్స్ తో ఎకౌంటు create చేయాల్సి వుంటుంది . 
  • ఎంటర్ చేసిన ఈమెయిలు ఎకౌంటు కు verify మెయిల్ వస్తుంది , దాన్నిConfirm Email Address పైన క్లిక్ చేసి verify  చేయాల్సి వుంటుంది . 
WordPress బ్లాగు ఉచితం గా create చేయబడుతుంది . తర్వాతి ఆర్టికల్ లో పోస్ట్ లు ఎలా చేయాలి , Theme ఎలా మార్చుకోవాలి అనేవిషయాలు వివరం గా తెలుసుకొందాం . 

No comments:

Post a Comment

మీ అబిప్రాయాలు / ప్రశ్నలు కామెంట్ బాక్స్ లో తెలియజేయండి ... మీ కామెంట్ కి సాధ్యమయినంత త్వరలో సమాదానం ఇస్తాము

techearn4u Designed by Templateism.com Copyright © 2014

Theme images by Bim. Powered by Blogger.