Latest News

వెబ్ సైట్ లేదా బ్లాగు ద్వారా ఎలా డబ్బు సంపాదిస్తారు?


వెబ్ సైట్ లేకుండా ఎలా డబ్బు సంపాదించాలి అనేది చూసాము. కానీ ఇలా డబ్బు చాలా తక్కువగానే వస్తుంది . కానీ ఒక సొంత వెబ్ సైట్ లేదా బ్లాగు ని తయారు చేసుకొని కూడా డబ్బు సంపాదించవచ్చు . అమ్మో వెబ్ సైట్ ఆ ?? మాకు కోడింగ్ తెలియాలి కదా ఎలా మాకు తెలియదే ...ఎలా...ఇలా చాలా మంది ఆలోచిస్తుంటారు . ఏమి తెలియనవసరం లేదు . ఇప్పుడు మనకు బ్లాగర్ లు వచ్చాక ఈ పని చాలా తేలికై పోయింది. ఈ ఆర్టికల్ నుండి బ్లాగు మరియు వెబ్ సైట్ లు ఎటువంటి కోడింగ్ తెలియకుండా నే అందమయిన బ్లాగు లేదా వెబ్ సైట్ ఎలా చేస్తారు దాని నుండి ఎలా సంపాదించాలి అనే విషయాలు తెలుసుకొందాము .

బ్లాగు / వెబ్ సైట్ ల ద్వారా ఎలా ?

మనం మన అబిరుచికి అనుగుణం గా మనలోని ఆలోచనలను ( ప్రతి ఒక్కరిలోనూ ఏదో టాలెంట్ వుండే వుంటుంది .. ఉదా : మీకు సినిమా ల పైన ఇంటరెస్ట్ లేదా మీరు మంచి పెయింటింగ్ లేదా మరు మంచి కధ లు రాసేవారైతే లేదా మంచి పాక శాస్త్ర ప్రావీణ్యులు ఇలా ఏదో ఒక కాన్సెప్ట్స్ ) ఒక వెబ్ సైట్ లో పొందుపరచి మన ఫ్రెండ్స్ కి లేదా మీ అబిరుచికి తగినట్లు గా వున్దేవారితో పంచుకొంటూ ఆ వెబ్ సైట్ లేదా బ్లాగు లలో Ads ని పొందుపరచడం ద్వారా మీ బ్లాగు / వెబ్ సైట్ visitor ఆ Ads క్లిక్ చేస్తే మీకు మనీ వచ్చేస్తుంది . 

బ్లాగు ల కోసం మనం డబ్బు కర్చు చేయాల్సిన అవసరం లేదు. దీనికోసం గూగుల్ బ్లాగర్ లో లేదా వర్డుప్రెస్సు లో ఉచితం గా తయారు చేసుకోవచ్చు . ఇక వెబ్ సైట్ ల విషయానికొస్తే కొంచం డబ్బు ఇన్వెస్ట్ చేయాల్సివుంటుంది ( ఎలా చేయాలో తర్వాతి ఆర్టికల్ లలో తెలుసుకొందాము ).మొదట గా , బ్లాగు / వెబ్ సైట్ ఎలా చేయాలో తెలుసుకొందాము . 

మరి Ads ( వ్యాపార ప్రకటనలు ) ఎలా సంపాదించాలి ?

ఓకే వెబ్ సైట్ లేదా బ్లాగు చేసి ఆర్టికల్స్ రాసేస్తాము మరి Ads ఎలా దొరుకుతాయి దానికి చేయాల్సిన పనేంటి ఇదేగా మీ ప్రశ్న అవును నిజమే మరి Ads ఎలా వస్తాయి దీనికి కొంచం కష్టపడాల్సి వుంటుంది .ఎలా చేయాలి అనేది తర్వాత ఆర్టికల్స్ లో వివరం గా తెలుసుకొందాము ) దీని గురించి కొంత క్లుప్తం గా తెలుసు కోవాలంటే ... వ్యాపార ప్రకటనలు అందించే సంస్థ లలో ముఖ్యమయినవి Google Adsense , infolnks, chitika . ఇంకా చాలానే ఉన్నాయి . వీటి లో Ads ఎలా పొందాలో మన బ్లాగు / వెబ్ సైట్ లో ఎలా వచ్చేలా చేయాలో వివరం గా తెలుసుకొందాము . ఇవి ఎలా పని చేస్తాయో ఉదాహరణకు : Google Adsense ఎలా పని చేస్తుందో గురించి తెలుసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చేయండి . 

మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్స్ మీ ఫేస్బుక్ లోకి notifications గా కావాలంటే side లో ఉన్న ఫేస్బుక్ పేజి like చేయండి . ఈ ఆర్టికల్ మీ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేయండి . 

3 comments:

  1. This comment has been removed by the author.

    ReplyDelete
    Replies
    1. శివ , godaddy నేమ్ కొంటే సరిపోదు , మీకు బ్లాగ్ వుంటే ... దాని నేమ్ ని మీరు కొన్న domain పేరుతో మార్చుకోవచ్చు . మీకు వెబ్ సైట్ ఉందా ? అది ఏ లాంగ్వేజ్ లో వుంది ? తెలుగు అయితే adsense రాదు , ఇంగ్లీష్ లేక హిందీ వుంటే మాత్రమే adsense వస్తుంది . నీ వెబ్ సైట్ సమాచారం ఇవ్వు ... చూసి చెప్తాను ...

      Delete
  2. This comment has been removed by the author.

    ReplyDelete

మీ అబిప్రాయాలు / ప్రశ్నలు కామెంట్ బాక్స్ లో తెలియజేయండి ... మీ కామెంట్ కి సాధ్యమయినంత త్వరలో సమాదానం ఇస్తాము

techearn4u Designed by Templateism.com Copyright © 2014

Theme images by Bim. Powered by Blogger.