Latest News

Google Adsense Approve అవాలంటే Process ఏంటి ?



Google Adsense Approval Process కొంచెం పెద్దదే .. కానీ కష్టం కాదు..


ఆన్లైన్ లో డబ్బు సంపాదించేందుకు వున్న మార్గాలలో సులబమయిన మార్గం గూగుల్ Adsense , ఈ ఆర్టికల్ లో Adsense Approve అవాలంటే Process ఏంటి ? అనేది చూద్దాం ... అయ్యో ... Process చాలా పెద్దది గా వుంది , ఇది మేము చేయగలమా ? అనే ప్రశ్న మీకు వస్తుంది ... Process కొంచం పెద్దదే , కానీ కష్టం కాదండోయ్ ... చాలా సులువుగా చేసేయోచ్చు ... Process లో వున్న Words మేము ఎప్పుడు వినను కూడా లేదు ఎలా అనుకొంటారేమో ... అలాంటి సందేహాలేమి వద్దు ... ప్రతి Step చాలా వివరం గా అర్ధమయ్యే పద్దతి లో వివరించడం జరుగుతుంది ... చెప్పినట్లు Follow అయిపోతే చాలు .. కేవలం 7 రోజుల్లోనే Adsense సులువుగా వచ్చేస్తుంది . Adsense గురించి గత ఆర్టికల్ లో కొంతవరకు తెలుసుకొన్నాము .. క్రింది లింక్ క్లిక్ చేసి చదవండి ...  మరికొన్ని విషయాలు ఈ ఆర్టికల్ లో ... 
Adsense ఏంటి దానినుండి డబ్బు ఎలా వస్తుంది ? Adsense Approve ఎలా వస్తుంది ?


వెబ్ సైట్ నేమ్ ఎలా వుండాలి ?


  • మొదటి గా మనకు ఒక బ్లాగ్ లేదా వెబ్ సైట్ వుండాలి ( ఎలా create చేయాలో (WordPress , Blogger  ఇక్కడ క్లిక్ చేయండి ) . 
  • Blogger లేదా WordPress లో బ్లాగ్ తయారు చేసినా కూడా మన సొంత డొమైన్ వుంటే Approval కి ఎక్కువ అవకాసం వుంటుంది , Blogger ని సొంత డొమైన్ నేమ్ ఎలా పొందాలో తర్వాతి ఆర్టికల్ లో చూద్దాం )

ఆర్టికల్స్ ఎలా వుండాలి ? ఏ భాష లో వుండాలి ? ఎలాంటి విషయాలు రాయకూడదు ?

  • వెబ్ సైట్ లో వుండే ఆర్టికల్స్ తప్పకుండా ఇంగ్లీష్ లేదా హిందీ లో వుండాలి , ఇంగ్లీష్ ఆర్టికల్స్ రాయలేని వారికోసం తర్వాతి ఆర్టికల్స్ లో కొన్ని టూల్స్ ఉపయోగించి ఎలా ఇంగ్లీష్ ఆర్టికల్స్ చేయాలో తెలుసుకొందాం .
  • మీరు రాసే ఆర్టికల్స్ పూర్తి గా మీ సొంతమై వుండాలి , వేరే వెబ్ సైట్ లో ఆర్టికల్స్ కాపీ చేయకూడదు.వెబ్ సైట్ లో కనీసం 20 నుండి 30 ఆర్టికల్స్ ఉండాలి .  ప్రతి ఆర్టికల్ లో కనీసం 500 words ఉండేలా చూసుకోవాలి , 2 లేదా 3 ఆర్టికల్స్ 2000 వర్డ్స్ ఉండేలా చూసుకోవాలి . 
  • ఆర్టికల్స్ లో మధ్యమధ్యలో ఉండే ఇమేజ్ లు గూగుల్ నుండి కాపీ చేయవచ్చు , కానీ కాపీహక్కులు (Copyrights) వుండే ఇమేజ్ లు ఉపయోగించకూడదు ( వాటిని ఎలా select చేసుకోవాలో తర్వాతి ఆర్టికల్స్ లో చూద్దాం )
  • Adult related మరియు హింస ను ప్రేరేపించేలా వుండే లా ఆర్టికల్స్ ఉండకూడదు .సాఫ్ట్వేర్ లకు సంబందించిన డౌన్లోడ్ లు , సాఫ్ట్వేర్ Hacking , డ్రగ్స్ , ఆల్కహాల్ , పొగాకు , మారణాయుదాలు  సంబందించిన  లాంటి  విషయాలు ఉండకూడదు . దీనిగురించి మరింత సమాచారం కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

వెబ్ సైట్ డిజైన్ ఎలా వుండాలి ? వెబ్సైటు లో ఇంకా ఏమి ఉండకూడదు ?

  • వెబ్సైటు డిజైన్ చాలా clear గా వుండాలి , మీ వెబ్సైటు visitor లకు సులువు గా ఉండేలా Navigation వుండాలి . గూగుల్ Adsense వాళ్ళు మన Request ని approve చేసేముందు మొదట గా చూసేది మన వెబ్సైటు Neat గా మంచి లుక్ తో వుందాలేదా అని , కాబట్టి మన వెబ్సైటు డిజైన్ చాలా ముఖ్యం ( తర్వాతి ఆర్టికల్స్ లో మంచి టెంప్లేట్ తో వెబ్సైటు అందం గా ఉండేలా మార్పులేలా చేయాలో చూద్దాం )
  • Approval కి రిక్వెస్ట్ పంపేముందు మన వెబ్సైటు లో ఏ ఇతర Advertisement లు ఉండకూడదు . 
  • వెబ్సైటు లో కొన్ని అదనపు పేజి లను ( Contact Us,About Us,Privacy Policy,Disclaimer Policy) Add చేయవలసివుంటుంది . 
ఇవి కాకుండా ఇంకా కొన్ని చేయాలి ... అవేంటంటే ... 


ఈ క్రింద చెప్పినవి కూడా చేస్తే Adsense Approval సులువు గా వచ్చేందుకు సహాయపడుతాయి . ఇవేవో కష్టమయిన పని అనుకోవద్దు , ఇవి కూడా చాలా సులువు గా చేసేయవచ్చు . అవి ఏంటంటే .. 
  • Google Analytic కోడ్ వెబ్సైటు కి Add చేయడం ( దీని ద్వారా మన వెబ్సైటు కి ఎంత మంది visitors వస్తున్నారు , ఏ పేజీ లను ఎక్కువ చూస్తున్నారు ? ఏ Location నుండి చూస్తున్నారు ? ఎంత మంది LIVE లో వున్నారు అనే విషయాలు  మనం Track చేసుకోవచ్చు . 
  •  XML Site Map ద్వారా వెబ్సైటు గూగుల్ సెర్చ్ లో మన వెబ్సైటు త్వరగా సెర్చ్ అయ్యేందుకు గూగుల్ బోట్స్ కి సహాయపడుతుంది . 
  • Google లేదా Bing Webmaster tool లో మన వెబ్సైటు Add చేయడం ద్వారా , మన వెబ్సైటు లో ఏమైనా Issues వుంటే సులువు గా కనుగొనవచ్చు . 

చూసారు కదా ? ఇంత కధ వుంది Adsense approve కావాలంటే .. పైన చెప్పినవన్నీ ఏదో బ్రహ్మ విద్యలు కావు ... చాలా సులువు .. పరిచయం లేని ఏ విషయమైనా అలానే వుంటుంది కదా ? :) ... పైన చెప్పిన Process మొత్తం ఒకటి తర్వాత ఒకటి చాలా సులువు గా ఉండేలా తర్వాతి ఆర్టికల్ లో చూడవచ్చు . ఇవన్ని  పాటిస్తే 100% మీరు గూగుల్  Adsense Approval సులువు గా పొందవచ్చు ... కష్టపడకుండా డబ్బు రావాలంటే ఎలా మరి :) ? అలాంటి కష్టం కూడా లేకుండా చేయాలనేదే ఈ వెబ్సైటు మఖ్య ఉద్దేశ్యం . 

1 comment:

  1. ok great ...blog alage youtube dwara money earning gurinchi cheppandi..

    ReplyDelete

మీ అబిప్రాయాలు / ప్రశ్నలు కామెంట్ బాక్స్ లో తెలియజేయండి ... మీ కామెంట్ కి సాధ్యమయినంత త్వరలో సమాదానం ఇస్తాము

techearn4u Designed by Templateism.com Copyright © 2014

Theme images by Bim. Powered by Blogger.