Latest News

ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా ? అయితే ఈ విషయాలు పాటిచడం మరచిపోవద్దు


ఆన్‌లైన్ షాపింగ్ : 
దీని గురించి వివరం గా చెప్పనక్కరలేదు , దీని గురించి తెలియని వారేవరున్నారు చెప్పండి ? మరి ఈ ఆర్టికల్ ఎందుకు అంటారా ? ఆన్‌లైన్ షాపింగ్ అంటే కొందరు అంతా మోసం అంటున్నారు , మరికొందరేమో ఆన్‌లైన్ షాపింగ్ అంటే ఏంటో  మాకు తెలుసు కానీ ఎలా చేయాలో తెలియదు , మరి కొందరు ఇలా చేస్తూ కూడా మాకే మైనా అదనం గా లాభం వస్తుందా ? అనే సందేహాలు సంధిస్తుంటారు ... దానికోసమే ఆన్‌లైన్ షాపింగ్ చేసే వాళ్లకు ఈ ఆర్టికల్ ద్వారా నాకు తెలిసిన కొన్ని విషయాలు తెలియజేయాలని అనుకుంటున్నాను .. అవేంటంటే ...
  •  ఆన్‌లైన్ షాపింగ్ చేసే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ?
  •  ఆన్‌లైన్ షాపింగ్ ఎలా చేస్తే డబ్బు ఆదా అవుతుంది ?
  •  ఆన్‌లైన్ షాపింగ్ కోసం మన దగ్గర ఏమేమి ఉండాలి ?
  •  ఇంకా ఏమైనా అదనపు ఆదాయం ఉంటుందా ? 


ఆన్‌లైన్ షాపింగ్ చేసే ముందు ఇవి మరచిపోవద్దు :

ఆన్‌లైన్ వెబ్ సైట్ లు ఉంటాయి , దానిలో మనకు నచ్చిన Item చూసుకొని కొనేస్తాం , అంతే కదా ? అంటే అంతే ... కానీ ఒక Item కొనే ముందు , Item నచ్చిన వెంటనే కొనేయవద్దు,  దాని గురించి కొంత Research చేయడం మంచిది. దానికోసం ఇతర వెబ్ సైట్ లలో Same Item Description చూడండి , ఇంతకు ముందే ఆ Item కొన్నవారు దానికి Star Rating ( 1 to 5 ) ఇచ్చి ఉంటారు మరియు అది ఎలా ఉంటుందో Review వ్రాసివుంటారు. ఒకసారి అవి కూడా పరిశీలించండి . మీకు కావలసిన item డీటెయిల్స్ ఒక వెబ్ సైట్ లో దొరకలేదంటే ఆ వెబ్ సైట్ జోలికి పోవద్దు.

Cost తక్కువ వుందని కొనడానికి తొందర పడవద్దు :

Price తక్కువ ఉందిలే అని అని ఏది పడితే అది కొనేయవద్దు. చాలా మంది చేసే పెద్ద తప్పు ఇదే , అవసరం ఉన్నా లేకున్నా తక్కువ ధరకు వస్తుందని కొనేస్తుంటారు.    

డిస్కౌంట్ లు , కూపన్లు కూడా డబ్బు ని ఆదా చేస్తాయి ...

చాలా వరకు షాపింగ్ Items కి డిస్కౌంట్ ఆఫర్ లు లభిస్తుంటాయి . వాటిని కూడా పరిశీలించండి , ఒక్కో వెబ్ సైట్ ఒక్కోలా ఇస్తుంటారు , వివిధ వెబ్ సైట్ లలో ఎలా ఉన్నాయో ఒకసారి పరిశీలించడం మంచిది . ఈ కూపన్ కోడ్ apply చేసి డబ్బు ఆదా చేసుకోవచ్చు , కూపన్ కోడ్ ఇవ్వడం మరిచిపోయారంటే , ఒకసారి order ఇచ్చిన తర్వాత , మరలా order cancel చేసి order ఇవ్వాల్సి వస్తుంది , కొన్ని items కి పర్వాలేదు , కొన్నింటిని cancel చేసినందుకు కొంత డబ్బు Cut అయిపోతుంది . కాబట్టి ఈ విషయం లో కొంచం జాగ్రత్త .

ఈ కూపన్ కోడ్ లు అందించేందుకు ప్రత్యేకం గా కొన్ని వెబ్ సైట్ లు అందుబాటు లో ఉన్నాయి , ఆ వెబ్ సైట్ లలో మనకు కావలసిన item కూపన్ దొరుకుతుందో లేదో ఒకసారి Search చేయాలి , లేదంటే డైరెక్ట్ గా కూపన్ లేకుండా order ఇవ్వడమే . కూపన్ కోడ్ లు లభించే కొన్ని వెబ్ సైట్ క్రింద చూడవచ్చు .

 Cash Back కూడా వెబ్ సైట్ లు ఉన్నాయి :

ఈ మద్య Cash Back కోసం Paytm బాగా పాపులర్ అయిపోయింది . దాదాపుగా ఆ వెబ్ సైట్ లో కొనే ప్రతి Item కు cash back ఇచ్చేస్తున్నారు. cashback వచ్చేస్తుంది అని కొనేయవద్దు, వేరే వెబ్ సైట్ లలో వాటి ధర ఎంత వుందో పరిశీలించి మరీ కొనడం మంచిది .

ఇంకా అదనం గా డబ్బు ఆదా చేసే మార్గం ఉందా ?

ఇంకా కావాలంటే కూడా వుంది ... అదే ఈ మద్య బాగా పాపులర్ అయిన వెబ్ సైట్ http://cashkaro.com . ఈ వెబ్ సైట్ లో అన్ని ఆన్లైన్ షాపింగ్ సైట్ ల వస్తువులన్నీ ఒక దగ్గరకు చేర్చి పెట్టబడి ఉంటాయి . మనకు కావలసిన వస్తువు ఎంచుకొని GRAB DEAL అని క్లిక్ చేస్తే మనం ఏ షాపింగ్ సైట్ లో ఆ item వుంటుందో ఆ వెబ్ సైట్ open చేయబడుతుంది . అక్కడ మనదగ్గర వున్న కూపన్ కోడ్ apply చేయడం ద్వారా కొంత మనీ ఆదా అవుతుంది మరియు http://cashkaro.com వెబ్ సైట్ నుండి లింక్ చేయబడింది కనుక http://cashkaro.com కూడా కొంత డబ్బు మనకు ఇస్తుంది .
 http://cashkaro.com ద్వారా ఎలా చేయాలో ఈ లింక్ పైన క్లిక్ చేసి వివరంగా తెలుసుకోండి .

(http://cashkaro.com కమీషన్ బిజినెస్ చేస్తుంది , http://cashkaro.com వాళ్లకు ఆ కంపనీ లు కొంత కమీషన్ ఇస్తాయి , దానినుండి మనకు http://cashkaro.com కొంత కమీషన్ ఇస్తారన్న మాట , ఇలాంటి బిజినెస్ నే Affiliate Marketing అంటారు , ఈ  Affiliate Marketing మనం కూడా చేసి డబ్బు సంపాదించవచ్చు , అదెలా చేయాలో తర్వాతి ఆర్టికల్ లో చూద్దాం ).

Order చేసిన Item నచ్చలేదంటే ఎలా ?
మీరు order చేసిన item నచ్చలేదంటే తిరిగి పంపేందుకు కూడా అవకాసం వుంటుంది , Return Policy కూడా ప్రతి ఆన్లైన్ వెబ్ సైట్ వాళ్ళు కాల్పిస్తున్నారు . కాబట్టి కొనేసాము కదా , నచ్చకపోతే పొతే ఎలా అనే సంశయం అవసరం లేదు , మీరు order చేసే item ని ప్రకారం ఎంత సమయం లో రిటర్న్ చేయాలి అనేది వెబ్ సైట్ లోనే ఆప్షన్ వుంటుంది , రిటర్న్ చేసాక ఏ అకౌంట్ తో అయితే order చేసామో , ఆ బ్యాంకు అకౌంట్ లోకి డబ్బు తిరిగి వచ్చేస్తుంది . 

ఆన్‌లైన్ షాపింగ్ కోసం మన దగ్గర ఏమేమి ఉండాలి ?
  •  షాపింగ్ కోసం ఏ వెబ్ సైట్ లు మంచి సర్వీస్ అందిస్తున్నాయా తెలుసుకోవడం
  •  ఆ షాపింగ్ వెబ్ సైట్ లలో అకౌంట్ create అయి ఉండాలి
  •  పైన చెప్పిన విషయాలు పాటిస్తూ items select చేయడం
  • Cash Payment ఉండే మార్గాలు  ఏమి ఉన్నాయో వెబ్ సైట్ లోనే ఉంటుంది

o   EMI ( ప్రతి నెలా installment పద్దతిలో చెల్లించడం , దీనికోసం కొన్ని వస్తువులకు అదనం గా డబ్బు వసూలు చేస్తారు , 0% EMI ఉంటే వెంటనే ఈ పద్దతిలో కొనడం ద్వారా డబ్బు ఒకసారి చెల్లించకుండా installment పద్దతిలో చెల్లించవచ్చు.
o   Credit Card లేదా Debit Card
o   Netbanking ( దీనికోసం Netbanking అకౌంట్ )
o   COD ( Cash On Delivery ) , Item ఇంటికి వచ్చిన తర్వాత డబ్బు చెల్లించడం.
(Debitcard , Creditcard , EMI ద్వారా ఎలా order చేయాలో తర్వాతి ఆర్టికల్ లో వివరం గా తెలుసుకొందాం )

ఇండియా లో 2015 డిసెంబర్ వరకు అత్యంత ప్రజాదరణ పొందిన 10 వెబ్ సైట్ లు ఏంటో  చూద్దాం ...

వెబ్ సైట్
రేటింగ్
5.6
5.68
4.9
4.85
4.7
4.1
4.1
4.55
          4.4
4.2



కూపన్ కోడ్ లు దొరికే వెబ్ సైట్ లు :

30. Just Pay Less  31. Shoppal  32. Couponz Guru  33. Coupon Rani  34. Coupon Daddy
35. FlipIt  36. EverySaving  37. Compare Raja  38. 33Coupons


ఇంకేమైనా సందేహాలుంటే కామెంట్ బాక్స్ లో రాయండి . ఈ ఆర్టికల్ షేర్ చేయడం మరచిపోవచ్చు . 

2 comments:

  1. sir konni areas ki COD undatam ledhu
    a a areas ki COD undho mundhe telusukovalante site yemanna untundha sir

    ReplyDelete
    Replies
    1. మీరు ఆన్లైన్ లో order చేసే టైం లోనే మీ ఏరియా లో COD ఆప్షన్ వుందో లేదో తెలిసిపోతుంది , వాటి కోసం వీ వెబ్ సైట్ లు అవసరం లేదు

      Delete

మీ అబిప్రాయాలు / ప్రశ్నలు కామెంట్ బాక్స్ లో తెలియజేయండి ... మీ కామెంట్ కి సాధ్యమయినంత త్వరలో సమాదానం ఇస్తాము

techearn4u Designed by Templateism.com Copyright © 2014

Theme images by Bim. Powered by Blogger.