Latest News

YouTube ద్వారా డబ్బు సంపాదించడం ఎలా ? ఇమేజ్ సెర్చ్ చేసి వీడియో గా ఎలా మార్చాలి ?


YouTube ద్వారా డబ్బు సంపాదించడం:
మనం రోజూ YouTube లో వీడియో చూస్తూ వుంటాం కదా ? మీరూ మీరో వున్న ప్రతిభ ను వీడియో ల రూపం లో బయటపెట్టి , డబ్బు సంపాదించేయ వచ్చు . వెబ్ సైట్ ద్వారా Money సంపాదించడం ఎలానో తెలుసుకొన్నాం కదా ? ప్రాక్టికల్ గా steps చేయాలంటే కొంచం సమయం పడుతుంది , ఈ లోపు YouTube ద్వారా ఎలా Money సంపాదించాలో తెలుసుకొందాం . ఈ Process కొంచం సులువుగా వుంటుంది . Adsense కూడా కేవలం ఒక రోజు లోపు Approve అవుతుంది . దీనిలో కష్టమయిన పని ఏమి లేదు , వీడియో లు తయారు చేసి Upload చేయడమే.

మరి ఎలాంటి వీడియో లు చేయాలి ? ఎలాంటివి చేయకూడదు ?

మనకు వున్న టాలెంట్ ఏదైనా ( ఉదా : ఇమేజ్ లపైన మంచి quotations రాయడం , రుచికరమయిన వంటలు చేయడం , సౌందర్య చిట్కాలు రాయడం , నచ్చిన ప్రదేశాలు షూట్ చేయడం),ఇలా ఇది చేయకూడదు అనేది లేకుండా మంచి విషయాలు ఏవైనా ఇమేజ్ లను వీడియో చేసి లేదా డైరెక్ట్ గా వీడియో లను తయారు చేసి అప్లోడ్ చేయోచ్చు . ఫేస్బుక్ లో ఏదో టైం వేస్ట్ చేయకొండా ఇలాంటివి చేసి డబ్బు సంపాదిన్చేవాళ్ళు చాలానే వున్నారు . ఇక్కడ క్రింద లింక్ ఇస్తున్నా చూడండి ... వీరు నెలకు షుమారు రూ.10000 వరకు లేదా 10000 పైగా  YouTube  చానల్ నుండి సంపాదిస్తున్నవారే ... మరి మనం కూడా ఎందుకు ఈ ఇలా వీడియో లు చేసి డబ్బు సంపాదించ కూడదు  ? 

ఆలోచించండి ... టెక్నికల్ గా ఎలాంటి సహాయం కావాలన్నా మాతో సంప్రదించండి  (ఉచితం గా నే నండోయ్ :) )... 


క్లిక్ చేయండి : Attamma TV   (వంటల చానల్ )  Craft చానల్ : Craft Making Channel

  • వీడియో లు మన సొంత వీడియోలు ఉండాలి , ఇతర YouTube ఛానల్ వీడియో లు డౌన్లోడ్ చేసి అప్లోడ్ చేయకూడదు . 
  • మన మొబైల్ లేదా వీడియో కెమెరా తో Shoot చేసిన మన సొంత వీడియో లు , లేదా మన కంప్యూటర్ లో Screen Recording software ద్వారా  చేసిన వీడియో లు చేయోచ్చు . 
  • Recording చేసిన తర్వాత ఆడియో మన సొంత voice లేదా మ్యూజిక్ అయివుండాలి , లేదా ఫ్రీ మ్యూజిక్ ( Internet లో మనకు చాలా వెబ్ సైట్ లు ఉచిత మ్యూజిక్ ని అందిస్తాయి , అవి ఉపయోగించుకోవచ్చు . స్క్రీన్ రికార్డింగ్ చేయాలంటే కూడా మనకు ఫ్రీ గా సాఫ్ట్వేర్ లు లబ్యామవుతాయి ( తర్వాతి ఆర్టికల్ లో ఎలా ఇవి ఉపయోగించాలో చూద్దాం )
  • ఇమేజ్ లు ఉపయోగించి వీడియో లు తయారు చేయోచ్చు . ఇమేజ్ లు కూడా copyright ఇమేజ్ లు ఉపయోగించకూడదు (  copyright లేని ఇమేజ్ లు ఎలా తెలుసుకోవాలో కూడా తెలుసుకొందాం ). ఫోటో లను వీడియో లు చేయడం కూడా తెలుసుకొందాం . 
  • మనకు సొంతం గా రెండు YouTube ఛానల్ లు ఉన్నా కూడా , ఒక చానల్ లో అప్లోడ్ చేసిన వీడియో లు మరొక చానల్ లో అప్లోడ్ చేయకూడదు . 
YouTube కోసం ఒక వీడియో తయారు చేద్దామా ?
మొదట గా కొన్ని ఇమేజ్ లను గూగుల్ సెర్చ్ నుండి డౌన్లోడ్ చేసుకొందాం , మనం చేసే వీడియో కోసం ఇమేజ్ లను డౌన్లోడ్ చేయాలంటే ఆ ఇమేజ్ లు copyright లేని ఇమేజ్ లు అయివుండాలి , దాని కోసం చాలా సులువు గా చిన్న సెట్టింగ్స్ చేసుకొని సెర్చ్ చేసుకోవచ్చు . ఎలా చేయాలో క్రింది వీడియో చూడండి .



ఇమేజ్ లు సెర్చ్ చేసుకొన్నా తర్వాత , వీటిని వీడియో గా చేయాలి కదా ?  దీనికోసం ఒక చిన్న సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకొందాం , ఈ సాఫ్ట్వేర్ ని మనం ఉచితం గా ఇక్కడ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు . దీనిని ఉపయోగించడం చాలా సులువు . ఎలా చేయాలంటే ... క్రింది వీడియో చూడండి , మీకే అర్ధమైపోతుంది , ఇంకా సందేహాలుంటే క్రింది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి , మీ సందేహాలకు త్వరలో సమాదానం లబిస్తుంది . 


చూసారు కదా ? గూగుల్ సెర్చ్ లో ఇమేజ్ లె కాదు మీ మొబైల్ నుండి మీరు అందం గా తీసుకొన్న ఫోటో లు , లేదా స్క్రీన్ రికార్డింగ్ చేసిన వీడియో లు , ఇలా ఎలాంటి వీడియో లు అయినా ( మీ సొంతవే నండోయ్ )  YouTube లో Upload  చేసిన తర్వాత ,  Adsense కోసం అప్లై చేయాలి . చాలా సులువు గా  వెంటనే Approval వచ్చేస్తుంది .

No comments:

Post a Comment

మీ అబిప్రాయాలు / ప్రశ్నలు కామెంట్ బాక్స్ లో తెలియజేయండి ... మీ కామెంట్ కి సాధ్యమయినంత త్వరలో సమాదానం ఇస్తాము

techearn4u Designed by Templateism.com Copyright © 2014

Theme images by Bim. Powered by Blogger.